Saturday, November 2, 2024

T20 World Cup : టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్…ఆమెరికా స్టేడియంల‌న్నీ బ్యాటింగ్ కే అనుకూలం

ఐపీఎల్ 2024 ముగియబోతోంది. ఈ నెల 27వ తేదీన ఫైనల్. దీని తరువాత టీ20 వరల్డ్ కప్‌ 2024 టోర్నమెంట్‌ మొదలు కానుంది. సుమారు నెల రోజుల పాటు ఉర్రూతలూగించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.జూన్ 2వ తేదీన టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. 29వ తేదీ వరకు కొనసాగుతుంది. వెస్టిండీస్, అమెరికా.. సంయుక్తంగా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తోన్నాయి. ఈ రెండు దేశాలు కలిపి మొత్తంగా ఏడు స్టేడియాల్లో మ్యాచ్‌లు షెడ్యూల్ కానున్నాయి.

- Advertisement -

తొలి సగం మ్యాచ్‌లు వెస్టిండీస్‌లోని ఆంటిగ్వా అండ్ బార్బుడా, బార్బడోస్, గయానా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగోల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. మిగిలిన సగం మ్యాచ్‌లు- అమెరికాలోని డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్‌ స్టేడియాల్లో నిర్వహించనుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ట్రినిడాడ్, గయానాల్లో రెండు సెమీ ఫైనల్స్, బార్బడోస్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.

ఈ మెగా టోర్నమెంట్‌లో భారత్- పాకిస్తాన్ తలపడనున్నాయి. జూన్ 9వ తేదీన ఈ దాయాదుల మధ్య పోరు ఉంటుంది. న్యూయార్క్.. దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. న్యూయార్క్‌లోని నస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అక్కడి కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.

మన్‌హట్టన్ నుంచి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నస్సౌ కౌంటీ స్టేడియం. యునైటెడ్ స్టేట్స్ క్రికెట్, ఐసీసీ సంయుక్తంగా దీన్ని నిర్మించాయి. ఆరు నెలల కాలంలో ఈ స్టేడియం నిర్మాణం మొత్తం పూర్తయింది. ఒకేసారి 34,000 వేలమంది మ్యాచ్ చూసేలా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
జమైకన్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ బుధవారం ఈ స్టేడియాన్ని ప్రారంభించారు. పిచ్‌ను సెంటర్ పాయింట్‌గా తీసుకుంటే.. తూర్పు-పశ్చిమం ఎండ్‌లో 75 గజాలు, ఉత్తరం- దక్షిణ వైపున 67 గజాల విస్తీర్ణంలో ఫీల్డ్ అందుబాటులో ఉంటుంది. ముంబైలోని వాంఖెడే స్టేడియం సైజ్‌లో దీన్ని నిర్మించినట్లు ఐసీసీ ఈవెంట్స్ హెడ్ క్రిస్ టెట్లె తేలిపారు. మొత్తంగా టీ20 వరల్డ్ కప్‌లో ఎనిమిది మ్యాచ్‌లు ఇదే స్టేడియంలో జరుగుతాయి. ఈ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్.. జూన్ 3వ తేదీన షెడ్యూల్ అయింది. లీగ్స్ దశ గ్రూప్ డీలో భాగంగా శ్రీలంక- దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. పాకిస్తాన్‌తో కలుపుకొని టీమిండియా మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడేది ఇక్కడే.

Advertisement

తాజా వార్తలు

Advertisement