ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ అందుబాటులోకి వచ్చాడు. కాలు నొప్పితో బాధపడుతున్న అతను పూర్తిగా కోలుకున్నాడు. దాంతో ఐపీఎల్ 2024 సీజన్ ఆడేందుకు బీసీసీఐ మెడికల్ టీమ్ అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న రాహుల్.. మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. అయితే ఆరంభ మ్యాచ్‌ల్లో అతను వికెట్ కీపింగ్ చేయవద్దని, కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్‌గా మాత్రమే జట్టులో కొనసాగాలని సూచించింది.
మార్చి 22న ఐపీఎల్ 2024 సీజన్‌కు తెరలేవనుండగా.. మార్చి 24న రాజస్థాన్ రాయల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది.