బీసీసీఐ యాజమాన్యం తాజాగా క్రికెట్ ప్రేమికులకు ఓ శుభవార్త అంధించింది. ప్రస్తుత IPL సీజన్‌లో, కరోనా ప్రోటోకాల్ కారణంగా స్టేడియంలలో 25 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే పర్మిషన్ ఉంది. అయితే 25 శాతం ఆక్యుపెన్సీని 50 శాతానికి పెంచుతూ బీసీసీఐ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏప్రిల్ 2 నుంచి రాష్ట్రంలో కరోనా ఆంక్షలను పూర్తిగా సడలిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో అన్ని మ్యాచ్‌లు జరిగే స్టేడియంలలో 50 శాతం ఆక్యుపెన్సీకి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 6 నుంచి జరిగే అన్ని మ్యాచ్‌లకు 50 శాతం ఆక్యుపెన్సీతో టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని బుక్ మై షో ఒక ప్రకటనలో తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..