వచ్చే షెఫీల్డ్ షీల్డ్ ఫైనల్ అనంతరం తాను ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నుంచి రిటైర్‌కానున్నట్లు ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్ చెప్పాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్ సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని తెలిపాడు. ”దీర్ఘ ఫార్మాట్లో ఎదురయ్యే సవాళ్లను ఆస్వాదించా.
పరిమిత ఓవర్ల క్రికెట్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం మాత్రం నా కెరీర్లో హైలైట్‌గా నిలుస్తుంది” అని వేడ్ ఓ ప్రకటనలో తెలిపాడు. షెఫీల్డ్ షీల్డ్ ఫైనల్ ఈ నెల 21న ఆరంభం కానుంది. వేడ్ ఆస్ట్రేలియా తరఫున 36 టెస్టుల్లో 28.87 సగటుతో 1613 పరుగులు చేశాడు. అతడు చివరిసారి 2021లో టెస్టు మ్యాచ్ ఆడాడు.