Monday, November 25, 2024

Sports | ఆర్చరీ వరల్డ్‌ కప్‌లో అభిషేక్‌ వర్మకు బంగారు పతకం

ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌ -3 కాంపౌండ్‌ పోటీల్లో అభిష్‌క్‌ వర్మ భారత దేశానికి స్వర్ణ పతకాన్ని సాధించి పెట్టాడు. పురుషుల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో జరిగిన ఫైనల్‌లో అమెరికన్‌ ఆర్చర్‌ను ఓడించాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్‌ పోరులో 148-146 తేడాతో 2019 ప్రపంచ చాంపియన్‌ జేమ్స్‌ లుట్జ్‌ను ఖంగు తినిపించాడు. సెమీఫైనల్‌కు ముందు నెదర్లాండ్‌కు చెందిన ప్రపంచ నెంబర్‌ 1, టాప్‌సీడ్‌ మైక్‌ ష్లోసెర్‌ను 148-148 (10 – 10)తో మట్టికరిపించాడు.

ఎనిమిదో సీడ్‌ వర్మ క్వార్టర్‌ పైనల్‌ పోరులో బ్రెజిల్‌కు చెందిన లుకాస్‌ అబ్రూస్‌ను ఓడించాడు. ఈ విజయం అతడిని ఫైనల్‌ చేర్చడంలో కీలకమైంది. 2021లో పారిస్‌ లో స్వర్ణం తర్వాత దాదాపు రెండేళ్ల విరామం అనంతరం అభిషేక్‌కి ఇదే తొలి స్వర్ణం. అంతకు ముందు 2015లో వోక్లా (పోలాండ్‌)లో తొలి వ్యక్తిగత వరల్డ్‌కప్‌ పసిడిని గెలుచుకున్నాడు. ప్రపంచకప్‌ వ్యక్తిగత విభాగంలో రెండు రజతాలు, ఒక కాంస్యాన్ని కూడా కలిగివున్నాడు.

ఇక రికర్వ్‌ మిక్స్‌డ్‌ పోటీల్లో భారత బృందం కాంస్యం రేసులో పోటీపడుతోంది. ఈ జట్టు 6-0తో ఫ్రాన్స్‌, నెదర్లాండ్‌ను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. అయితే కొరియా చేతిలో 5-3తో ఓడింది. కాంస్య పతకం కోసం ఇప్పుడు వారు చైనీస్‌ తైపీ జట్టుతో పోరాడనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement