ఆసియా జూనియర్ క్యాడెట్ చాంపియన్ షిప్‌ను ఇండియన్ పెడ్లర్లు స్వర్ణోత్సాహంతో ముగించారు. పాయస్ జైన్, యశస్విని స్వర్ణపతకం సాధించారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ పోరులో చైనా జంట హాన్ జిన్యుయాన్, కిన్ యుగ్జువాన్పై 3-2 పాయింట్ల తేడాతో నెగ్గారు. 11-9, 11-1, 10-12, 7-11, 11-8 పాయింట్లతో వరుస సెట్లలో రాణించారు. కాగా, ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణపతం.
గతనెల బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో మిక్స్డ్ డబుల్స్ జోడీ శరద్ కమల్, శ్రీజ ఆకుల స్వర్ణ పతకాన్ని సాధించిపెట్టారు. ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో మూడు కాంస్య పతకాలు దక్కాయి. అండర్ -19 బాలుర డబుల్స్‌లో రెండు, అండర్ -19 బాలికల్ సింగిల్స్‌లో ఒక కాంస్య పతకం లభించింది. మొత్తంగా నాలుగు పతకాలతో మన జూనియర్లు టోర్నీని విజయవంతంగా ముగించారు.