Friday, November 22, 2024

Asian Athletes :దీపాన్ష్ కు స్వ‌ర్ణం..

దుబాయ్‌ వేదికగా ప్రారం భ మైన అండర్‌-20 ఏషియన్‌ అథ్లెటి క్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు సత్తాచాటారు. ఇక్కడ జరిగిన పోటీల్లో భారత్‌కు మూడు (1 స్వర్ణం, 2 రజతాలు) పతకాలు వచ్చా యి. జావెలిన్‌ త్రోలో దీపాన్షు బంగా రు పతకం కైవసం చేసుకోగా.. రోహన్‌ సిల్వర్‌ మెడల్‌తో మెరిసాడు.

- Advertisement -

అంత కుముందు జరిగిన డిస్కస్‌ త్రోలో రితిక్‌ రాథీ భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు. పురుషుల విభాగం డిస్కస్‌ త్రో ఫైనల్స్‌లో రితిక్‌ రాథీ డిస్కస్‌ను 53.01 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో రజతాన్ని సొంతం చేసుకు న్నాడు. తర్వాత జరిగిన పురుషుల జావెలిన్‌ త్రో ఫైనల్స్‌లో దీపాన్షు శర్మ బళ్లెంను 70.29 మీటర్ల దూరం విసిరి భారత్‌కు ఈ ఎడిషన్‌లో తొలి బంగా రు పతకా న్ని అందించాడు. మరో వైపు రెండో స్థానంలో నిలిచిన రోహన్‌ యాదవ్‌ జావెలిన్‌ను 70.03 మీటర్లు విసిరి సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. కాగా, ఈ చాంపియన్‌షిప్‌లో భారత్‌ నుంచి 60 మంది అథ్లెట్లు వివిధ ఈవెంట్‌లలో పాల్గొంటున్నారు. గతేడాది జరిగిన పోటీల్లో భారత్‌ మొత్తం 19 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement