రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆల్‌రౌండర్ మ్యాక్స్ వెల్ పై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ప్రశంసలు కురిపించాడు. అందరికంటే ఎక్కువగా తను నన్ను ఆశ్చర్యపరిచాడు. బెంగళూరు ఫ్రాంఛైజీ అతడి కోసం మరీ ఎక్కువ మొత్తం ఖర్చు చేసిందని భావించాను. కానీ నా అభిప్రాయం తప్పని అతడు నిరూపించాడు. యాజమాన్యం సైతం తనకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటామంటూ పూర్తి నమ్మకం ఉంచిందని…దానిని నిలబెట్టుకున్నాడు. వైఫల్యాల నుంచి బయటపడి పూర్వపు ఫాంలోకి వచ్చాడను ప్రశంసించాడు.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మాక్సీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 49 బంతుల్లో 9 ఫొర్లు, 3 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేసి సత్తా చాటాడు. మాక్స్‌వెల్‌తో పాటు డివిలియర్స్ వీరోచిత ఇన్నింగ్స్ కారణంగా కేకేఆర్‌పై విజయభేరి మోగించిన ఆర్సీబీ, ఈ సీజన్‌లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేసింది. కాగా గత సీజన్‌లో పంజాబ్ తరఫున ఆడిన మాక్స్‌వెల్ 13 మ్యాచ్‌లు ఆడి మొత్తంగా 108 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్ అతడిని వదులుకోగా, మినీ వేలం-2021లో భాగంగా ఆర్సీబీ రూ. 14.25 కోట్లకు కొనుగోలు చేసింది.