జడేజాను సీఎస్‌కే కెప్టెన్‌గా ఎంచుకోవడం ఆ జట్టు చేసిన పెద్ద తప్పు అని మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తేల్చి చెప్పేశాడు. జడేజా నాయకత్వంలో సీఎస్‌కే 8 మ్యాచులు ఆడితే కేవలం 2 మాత్రమే గెలిచిందని, ధోనీ కెప్టెన్సీగా ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని, ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం కోల్పోయి ఉండేది కాదని వివరించాడు. సీఎస్‌కే పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉందని, సీఎస్‌కే వైఫల్యానికి బ్యాటర్ల పేలవమైన ప్రదర్శన కూడా ఓ ప్రధాన కారణమని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. 11 మందితో కూడా స్థిరమైన జట్టు లేదని, రుతురాజ్ సీజన్ ప్రారంభం సరిగా లేదని, ప్రారంభంలో పేలవమైన ప్రదర్శన కనబర్చాడని తెలిపాడు. సీజన్ మొత్తంలో సీఎస్‌కే పరిస్థితి చాలా గందరగోళంగా ఉందని అభిప్రాయపడ్డాడు. ప్రారంభం నుంచి సీఎస్‌కే కెప్టెన్‌గా ధోనీ ఉంటే.. ఇన్ని మ్యాచులు ఓడిపోయేది కాదని చెప్పుకొచ్చాడు. బుధవారం నాటి మ్యాచ్‌లో ధోనీ రనౌట్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. ధోనీ చివరి వరకు ఉండి ఉంటే.. కచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేవని చెప్పుకొచ్చాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement