Friday, November 22, 2024

ICC Rankings | నాలుగో స్థానానికి ఎగబాకిన గిల్‌.. టీ20లో నం.1గా సూర్య

అంతర్జాతీయ క్రికెట్‌ మండలీ (ఐసీసీ) బుధవారం టెస్టు, వన్డే, టీ20ల తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇటీవల వెస్టిండీస్‌లో జరిగిన వన్డే సిరీస్‌తో పాటు ఐర్లాండ్‌లో జరుగుతున్న టీ20 సిరీస్‌లలో రాణించిన టీమిండియా ఆటగాళ్లు తమ ర్యాంక్‌లను మెరుగుపరుచుకున్నారు. వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత యువ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మాన్‌ గిల్‌ ఒక స్థానం ఎగబాకి 4వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గిల్‌ మంచి ప్రదర్శన చేశాడు. గిల్‌ 743 రేటింగ్‌ పాయింట్లతో నాలుగో స్థానంలో చెరుకున్నాడు.

భారత్‌ తరఫున గిల్‌ టాప్‌లో ఉన్నాడు. ఈ విభాగంలో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (880) రేటింగ్‌ పాయింట్లతో తన అగ్ర స్థానాన్ని కాపడుకున్నాడు. దక్షిణాఫ్రికా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ వాన్‌ డర్‌ డెస్సెన్‌ (777) రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. అఎn్గానిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో రాణించిన పాక్‌ బ్యాట్స్‌మన్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ (752) ఒక స్థానం మెరుగుపర్చుకొని మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు.

పాక్‌ మరో బ్యాట్స్‌మన్‌ ఫకర్‌ జమాన్‌ (740) రెండు స్థానాలు దిగజారి 5వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. టీమిండియా స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ 9వ, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 11వ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో మహ్మద్‌ సిరాజ్‌ (670) ఒక స్థానం దిగజారి 5వ ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లు హాజిల్‌ వుడ్‌ (705), మిఛెల్‌ స్టార్క్‌ (686) వరుసగా టాప్‌ 2 ప్లేస్‌లలో ఉన్నారు. అఫ్గానిస్థాన్‌ బౌలర్లు ముజీబుర్‌ రహ్మాన్‌ (680), రాషిద్‌ ఖాన్‌ (679) 3,4 ర్యాంకుల్లో నిలిచారు. ముజీబ్‌ తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకోగా.. రషీద్‌ మాత్రం ఒక స్థానం దిగజారాడు. కుల్దిప్‌ యాదవ్‌ (622) 10వ స్థానంలో నిలిచాడు.

- Advertisement -

టీ20ల్లో సూర్యనే టాప్‌..

టీ20ల్లో భారత హిట్టర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాటింగ్‌ విభాగంలో తన టాప్‌ ప్లేస్‌ను కాపాడుకున్నాడు. ఐర్లాండ్‌ సిరీస్‌లో ఆడకపోయిన సూర్య (889) తన అగ్ర స్థానంలోనే కొనసాగుతున్నాడు. పాక్‌ బ్యాట్స్‌మెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ (811), బాబర్‌ ఆజమ్‌ (756) వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. మరోవైపు దక్షిణాఫ్రికా బ్యాటర్లు మార్క్‌రమ్‌ (748), రిలీ రాస్సో (724) 4,5 ర్యాంకుల్లో ఉన్నారు. ఐర్లాండ్‌ సిరీస్‌లో రాణిస్తున్న రుతురాజ్‌ గైక్వాడ్‌ 143 స్థానాలు ఎగబాకి 87వ స్థానానికి చేరకున్నాడు.

ఇక టీ20 బౌలింగ్‌లో అఫ్గాన్‌ యువ సంచలనం రషీద్‌ ఖాన్‌ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. భారత్‌ తరఫున టాప్‌-10లో ఎవరు లేకపోవడం గమనార్హం. ఇక బౌలింగ్‌ విభాగంలో ఇటీవలే గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేసిన భారత స్టార్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఏడు స్థానాలు మెరుగుపర్చుకొని 84వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. మరోవైపు రవి బిష్ణోయ్‌ 17 స్థానాలు ఎగబాకి 65వ స్థానంలో నిలిచాడు. టెస్టు బౌలింగ్‌లో భారత స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (879) పాయింట్లు అగ్ర స్థానాన్ని కాపాడుకోగా.. ఇక రవీంద్ర జడేజా (782) పాయింట్లు రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 3వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

దక్షిణాఫ్రికా పేసర్‌ కసిగో రబడా రెండవ స్థానంలో ఉన్నాడు. ఇక టీ20 టాప్‌ ఆల్‌రౌండర్ల విభాగంలో బంగ్లాదేశ్‌ స్టార్‌ షాకిబుల్‌ హసన్‌ (288) తొలి స్థానంలో నిలవగా.. టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ది క్‌ పాండ్య (240) రెండవ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement