ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఆటగాళ్లు శుభ్‌మాన్ గిల్, ఇషాన్ కిషన్ అదరగొట్టారు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ గిల్ (62 బంతుల్లో 67నాటౌట్) సత్తా చాటాడు. దాంతో బుధవారం ఐసీసీ విడుదల చేసిన తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో శుభ్‌మాన్ గిల్ ఒక్క స్థానం మెరుగుపరుచుకొని తన కెరీర్ అత్యుత్తమ 3వ ర్యాంకును అందుకున్నాడు. దాంతోపాటు భారత్ తరఫున టాప్ ప్లెస్‌లో నిలిచాడు. గిల్ 750 రేటింగ్ పాయింట్లు సాధించాడు. మరోవైపు ఆసియాకప్ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై చిరస్మరణీయ బ్యాటింగ్ చేసిన ఇషాన్ కిషన్ 82 పరుగులు చేశాడు.
దీంతో యువ స్టార్ బ్యాటర్ ఏకంగా 12 స్థానాలు ఎగబాకి 24వ స్థానానికి చేరుకున్నాడు. భారత్ తరఫున టాప్-10లో గిల్‌తో పాటు విరాట్ కోహ్లీ ఒక్కడే ఉన్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో కోహ్లీ ఒక్క స్థానం దిగజారి 9 నుంచి 10 ర్యాంక్‌కు పడిపోయాడు. అలాగే భారత సారథి రోహిత్ శర్మ తన 11వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. వన్డేల్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ( 882) పాయింట్లతో అగ్ర స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ వాండర్ డస్సెన్ (777) పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇమామ్ ఉల్ హక్ (పాకిస్తాన్), హ్యారీ టెక్టర్ (ఐర్లాండ్) వరుసగా 4,5 స్థానాల్లో నిలిచి టాప్-5లో చోటు సాధించారు. ఇక బౌలింగ్‌లో భారత యువ పేసర్ మహ్మద్ సిరాజ్ నాలుగో ర్యాంకు నుంచి 8వ ర్యాంకుకు పడిపోయాడు. ఇంతకుముందు 10వ ర్యాంకులో ఉన్న చైనామన్ కుల్దిప్ యాదవ్ 12 ర్యాంకుకు పడిపోయాడు. బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.
ఆస్ట్రేలియాకే చెందిన మిఛెల్ స్టార్క్ రెండు, కివీస్ బౌలర్ మాట్ హెన్రీ మూడో ర్యాంకులో నిలిచారు. 4వ ర్యాంక్‌లో ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్), 5వ ర్యాంక్‌లో షహీన్ షా అఫ్రిది (పాకిస్తాన్) టాప్-5లో చోటు సాధించారు. ఆల్‌రౌండర్ల జాబితాలో భారత్ నుంచి హార్దిక్ పాండ్య 10వ ర్యాంక్‌లో ఉండగా.. బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ టాప్ ప్లెస్‌లో కొనసాగుతున్నాడు. తర్వాతి స్థానల్లో సికందర రజా (జింబాబ్వే), రషీద్ ఖాన్ (అఎn్గానిస్తాన్) టాప్-3లో చోటు దక్కించుకున్నారు.