లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఆడబోతున్నట్లు టీ మిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రకటించాడు. సెప్టెంబర్ 17న ప్రారంభం కానున్న ఈ లీగ్ రెండో ఎడిషన్‌లో ఆడతానని చెప్పాడు. చాలా రోజుల తర్వాత మైదానంలో అడుగు పెట్టబోతున్నందుకు గంభీర్ ఆనందం వ్యక్తం చేశాడు. మళ్లి వరల్డ్ క్రికెట్‌లో భుజాలు ఎగురవేసేందుకు ఆతృతగా ఉన్నట్లు గంభీర్ పేర్కొన్నాడు.
లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో గంభీర్ ఇండియా మహరాజాస్ తరపున ఆడనున్నాడు. అయితే ఇండియా మహరాజాస్ వర్సెస్ వరల్డ్ జెయింట్స్ మధ్య సెప్టెంబర్ 16న మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌కు గంభీర్ అందుబాటులో ఉండడం లేదు. గంభీర్ సెప్టెంబర్ 17 నుంచి లీగ్‌కు అందుబాటులోకి వస్తాడు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో ఇయాన్ మోర్గాన్ నాయకత్వంలోని వరల్డ్ జెయింట్స్‌తో ఇండియా మహరాజాస్ టీమ్ తలపడనుంది. ఈ జట్టుకు సౌరవ్ గంగూలీ నాయకత్వం వహించనున్నాడు. ఇక లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2వ ఎడిషన్‌లో 4 జట్లు మొత్తం 15 మ్యాచ్‌లు ఆడతాయి.
కెరీర్..
గౌతమ్ గంభీర్ టీమిండియా తరపున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టి 20లు ఆడారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అతను 10 వేలకు పైగా రన్స్ సాధించాడు. 2007లో టి 20 వరల్డ్ కప్ విజయంలో కీలకపాత్ర పోషించిన గంభీర్… అటు 2011లో వన్డే వరల్డ్ కప్ సాధించడంలోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వరల్డ్ కప్ ఫైనల్లో 97 పరుగులు సాధించాడు. అటు ఐపిఎల్‌లో గంభీర్ సారథ్యంలో కోల్ కతా నైట్ రైడర్స్ 2012, 2014లో టైటిల్స్ సాధించింది. గంభీర్ 2018లో అనన్నిరకాల క్రికెట్ ఫార్మట్ల నుంచి రిటైర్ అయ్యాడు.