ఆంధ్ర ప్రభ – ముంబయి – భారత పురుషుల జట్టు ప్రధాన కోచ్‌గా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ నియమితులయ్యాడు. దాంతో, గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధానికి తెరపడింది. మంగళవారం బీసీసీఐ సెక్రటరీ జై షా అధికారక ప్రకటన వెల్లడించాడు. ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని గంభీర్‌ను భర్తీ చేస్తున్నట్టు షా తెలిపాడు. రెండేండ్లు గంభీర్ పదవిలో కొనసాగనున్నాడు.
ఇక వీరేంద్ర సెహ్వాగ్ జోడీగా గంభీర్ టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. అంతేకాదు రెండు ఐసీసీ ట్రోఫీ(2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్)లు గెలిచిన జట్టులో గౌతీ సభ్యుడు.
అంతేకాదు ఐపీఎల్‌లో ఏడు సీజన్లు కోల్‌కతా కెప్టెన్‌గా వ్యవహరించన గౌతీ.. రెండుసార్లు జట్టును చాంపియన్‌గా నిలిపాడు. ఇక పదిహేడో సీజన్‌లో మెంటార్‌గా మళ్లీ కోల్‌కతాకు ట్రోఫీ కట్టబెట్టాడు. దాంతో, బీసీసీఐ పెద్దలు గౌతీని కోచ్ పదవికి ఎంపిక చేసారు..