Friday, November 22, 2024

ఒత్తిడిని జయిస్తే కప్ ఆర్సీబీదే: గంభీర్

ఐపీఎల్‌- 2021లో ఆర్సీబీ మంచి జోరుమీదున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఐదింటిలో గెలుపొంది సత్తా చాటింది. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని ఉవ్విళ్లూరుతున్న బెంగళూరు జట్టు ఇప్పటికే ప్రాక్టీసు మొదలెట్టేసింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి మొదలుకానున్న రెండో అంచెకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్ గంభీర్ ఆర్సీబీపై కీలక వ్యాక్యలు చేశారు. ఇంతవరకు ఒక్కసారి ఐపీఎల్‌ టైటిల్‌ గెలవని ఆర్సీబీ మీద ఏడాదికేడాది ఒత్తిడి పెరుగుతూనే ఉంటుందనేది కాదనలేని సత్యం. ముఖ్యంగా కోహ్లి, ఏబీ మెరుగ్గా రాణిస్తేనే అనుకున్న ఫలితాలు సాధిస్తారు. లేదంటే.. తదుపరి సీజన్లలోనూ ఆ ఒత్తిడి అలాగే కొనసాగుతుంది’’అని పేర్కొన్నాడు. 

‘‘విరాట్‌కు ఏబీ డివిల్లియర్స్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు. ఒకవేళ మాక్సీ అందుబాటులో లేకపోయినా.. డివిల్లియర్స్‌ అనే అతిపెద్ద బలం తనకు ఉండనే ఉంది. జస్‌ప్రీత్‌ బుమ్రా వంటి స్టార్‌ బౌలర్లను ఎదుర్కోవడంతో ఏబీకి ఎవరూ సాటిరారు. తనలాగా యార్కర్ల కింగ్‌ను ఎదుర్కొన్న మరో బ్యాట్స్‌మెన్‌ను నేనింత వరకూ చూడలేదు. ప్రత్యర్థి జట్టుపై పైచేయి సాధించాలని కోహ్లి రచించే వ్యూహాలు పక్కాగా అమలు కావాలంటే ముందుగా ఒత్తిడిని జయించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. కాగా సెప్టెంబరు 20న అబుదాబిలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఆర్సీబీ ఐపీఎల్‌ రెండో దశను ఆరంభించనుంది.

ఇది కూడా చదవండి: మహిళలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు…

Advertisement

తాజా వార్తలు

Advertisement