భారత జట్టు పురుషుల జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎంపిక దాదాపు ఖాయమైనట్లు తెస్తోంది. దీనిపై ఈ నెల ఆఖరులోగా బీసీసీఐ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌తో ముగియనుంది. అయితే జూలై 1 నుంచి టీమిండియా కొత్త కోచ్ బాధ్యతలను గంభీర్ స్వీకరించే చాన్స్ ఉంది.
ఈ పదవి కోసం రికీ పాంటింగ్, స్టీవెన్ ఫ్లెమింగ్, జయవర్దనే, జస్టిన్ లాంగర్ వంటి దిగ్గజాలు పోటీపడినా.. బీసీసీఐ మాత్రం గంభీర్వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా జింబాబ్వే, శ్రీలంక పర్యటనలకు వెళ్లనుంది. జులై 6 నుంచి 14 వరకు జరిగే జంబాబ్వే పర్యటనలో భారత్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇక గంభీర్ కొత్త కోచ్‌గా బాధ్యతలు చేపడితే జింబాబ్వే సిరీస్‌తో అతడి విధులు మొదలవుతాయి.