Friday, November 22, 2024

నవంబర్‌ 21 నుంచి డిసెంబర్‌ 18 వరకు.. ఖతార్‌ వేదికగా ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌

ఫిఫా వరల్డ్‌ కప్‌ టోర్నమెంట్‌ నిర్వహణకు రంగం సిద్ధమైంది. నవంబర్‌ 21 నుంచి ఖతార్‌ వేదికగా జరుగనుంది. 32 దేశాల నుంచి ఫుట్‌బాల్‌ జట్లు పాల్గొననున్నాయి. 8 వేదికల్లో ఫుట్‌బాల్‌ పోటీలు జరుగనున్నాయి. క్రీడాకారులందరికీ వసతి ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు. క్రీడాకారులకు అన్నీ అందుబాటులో ఉండేలా వసతి ఏర్పాట్లు చేసినట్లు ఫిఫా వెల్లడించింది. హోటల్స్‌ నుంచి ట్రైనింగ్‌ సెంటర్లకు, హోటల్స్‌ నుంచి టోర్నీ వేదికలకు సులభంగా చేరుకునేలా, 32 దేశాల జట్లకు సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు.

32 టీమ్‌ల్లో 24 జట్లకు దోహాకు అతి సమీపంలో ఉండేలా వసతి ఏర్పాటు చేసినట్లు ఫిఫా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ కొలిన్‌ స్మిత్‌ తెలిపారు. ఫోర్‌ అండ్‌ ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌తోపాటు విల్లాస్‌, రిసార్ట్స్‌ల్లోనూ, స్పోర్ట్స్‌ అకాడమీ రెసిడెన్సీస్‌ల్లోనూ వసతి కల్పించినట్లు వివరించారు. టోర్నీకి ఐదు రోజులు ముందే ఆయా దేశాల నుంచి ఫుట్‌బాల్‌ జట్లు విచ్చేసి తమకు కల్పించిన వసతి, ట్రైనింగ్‌ క్యాంప్స్‌ తదితర వాటిని చెక్‌ చేసుకోవాలని సూచించామని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement