కరోనా వైరస్ ప్రభావం వల్ల ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ వారం ఆలస్యంగా ప్రారంభం కానుంది. మే 23న మొదలవ్వాల్సిన టోర్ని 30 న జరగనుందని ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య వెల్లడించింది. ఫ్రాన్స్‌లో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడంతో పాటు దేశవ్యాప్తంగా ఆంక్షలు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఈ పోటీలు జరిపేందుకు ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. అయితే, ఈ పోటీలను వీలైనంత వరకూ ప్రేక్షకులకు అనుమతినిస్తూనే జరిపించాలని భావిస్తున్నామని వెల్లడించింది. గత సంవత్సరం కూడా ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ దాదాపు ఐదు నెలలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ లో జరిగిన పోటీలకు పరిమిత సంఖ్యలో వీక్షకులను అనుమతించారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది
Advertisement
తాజా వార్తలు
Advertisement