Friday, December 27, 2024

Fourth Test : విరాట్ కు ఐసీసీ భారీ జరిమానా

మెల్బోర్న్ : టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. ప్రధానంగా బాక్సింగ్ డే టెస్ట్ లో ఆస్ట్రేలియా ఓపెనర్ కోన్ట్సస్ ను విరాట్ స్లెడ్జ్ చేసిన ఘటనపై ఐసీసీ తీవ్రంగా స్పందించింది. బాక్సింగ్ డే టెస్ట్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న 19 ఏళ్ల ఆస్ట్రేలియా ఓపెనర్ కోన్ట్సస్ ను విరాట్ కోహ్లీ స్లెడ్జ్ చేశారు. నడుచుకుంటూ వస్తుండగా కోహ్లీ భుజం తగిలించారు. అనంతరం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అంపైర్లు, తోటి ప్లేయర్లు వచ్చి కూల్ చేసారు.

ఈ ఘటన తరువాత కోన్ట్సస్ రెచ్చిపోయారు. వరుస బౌండరీలతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 60 రన్స్ చేసి జడేజా బౌలిగ్ లో ఔట్ అయ్యాడు. స్లెడ్జ్ చేసిన ఘటన పై కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పెట్టింది ఐసీసీ. కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 1 కింద ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. నెక్ట్స్ మ్యాచ్ నుంచి ఆయనను తొలగిస్తారని వార్తలు వినిపించగా.. జరిమానాతో సరిపెట్టింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement