Saturday, November 23, 2024

Sports : మహిళల ఆసియా కప్ లో.. నలుగురు తెలుగమ్మాయిలు

ఈ నెల 12వ తారీఖు నుండి ఎమర్జింగ్ ఆసియా కప్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో హైదరాబాద్ కు చెందిన గొంగడి త్రిష, మదివాల మమత, ఎస్ యశశ్రీ, ఆంధ్ర ప్రదేశ్ క్రికెటర్ బి. అనూష చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు ఆలిండియా మహిళల సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు అండర్19 ప్రపంచ కప్ విజేత జట్టులో కీలకంగా వ్యవహరించిన శ్వేతా సెహ్రవాత్ కెప్టెన్ గా వ్యవహరించనుంది. హైదరాబాద్ కు చెందిన నూషిన్ అల్ ఖాదీర్ హెడ్ కోచ్ గా పని చేయనుంది. ఈ టోర్నీ హాంకాంగ్ లో జరగనుంది. ఇందులో ఎనిమిది జట్లు రెండు గ్రూపుల్లో తలపడుతాయి. భారత-ఎ జట్టు గ్రూప్-ఎలో హాంకాంగ్, థాయ్ లాండ్, పాకిస్థాన్-ఎ జట్లతో పోటీ పడనుంది. జూన్ 13న హాంకాంగ్, 15న థాయ్ లాండ్, 17న పాక్ తో భారత్ మ్యాచ్ లు ఉంటాయి. భారత్-జట్టు: శ్వేతా సెహ్రావత్ (కెప్టెన్), సౌమ్య తివారీ (వైస్ కెప్టెన్), త్రిష గొంగడి, ముస్కాన్ మాలిక్, శ్రేయాంక పాటిల్, కనికా అహుజా, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), మమత మడివాలా (వికెట్ కీపర్), టిటాస్, యశశ్రీ ఎస్, కష్వీ గౌతమ్, పార్షవి చోప్రా, మన్నత్ కశ్యప్, బి అనూష. ప్రధాన కోచ్: నూషిన్ అల్ ఖదీర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement