Thursday, November 21, 2024

ఫార్ములావన్‌ ప్రపంచ చాంపియన్‌ వెర్‌స్టాపెన్‌

ఫ్రాన్స్‌: మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ పార్ములావన్‌ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించాడు. ఆదివారం నాటకీయ పరిణామాల మధ్య అబుదాబి గ్రాండ్‌ ప్రిను గెలుచుకుని ఫార్ములావన్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. ఈక్రమంలో టైటిల్‌ గెలుచుకున్న తొలి డచ్‌ రేసర్‌గా నిలిచాడు. రెడ్‌బుల్‌ డ్రైవర్‌ వెర్‌స్టాపెన్‌ చివరి ల్యాప్‌లో ఏడుసార్లు ఛాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ను అధిగమించి పాయింట్ల రేసులో దూసుకుపోయాడు.

మెర్సిడస్‌ డ్రైవర్‌ హామిల్టన్‌కు షాక్‌ ఇచ్చిన వెర్‌స్టాపన్‌కు ఇదే తొలి టైటిల్‌. రేసులో చివరి ల్యాప్‌ వరకు నువ్వా నేనా అన్నట్లు హామిల్టన్‌, వెర్‌స్టాపెన్‌ పోటీపడినా చివరికి విజయం వెర్‌స్టాపెన్‌నే వరించింది. దీంతో ఎఫ్‌1 రేసింగ్‌లో వెర్‌స్టాపెన్‌ చరిత్ర సృష్టించాడు. హోరాహోరీగా జరిగిన ఫైనల్‌ రేసులో ఆఖరి లాప్‌ను వెర్‌స్టాపెన్‌..హమిల్టన్‌ కంటే 1.22.09 సెకన్లు ముందుగా ముగించి 24ఏళ్ల బెల్జియన్‌ బోర్న్‌ డచమ్యాన్‌ మ్యాక్స్‌ ప్రథమస్థానంలో నిలిచాడు. హామిల్టన్‌ 1.22.480 సెకన్లతో రెండోస్థానంలో నిలిచాడు. దీంతో ఎనిమిదోసారి ప్రపంచ టైటిల్‌ను దక్కించుకోవాలన్న హామిల్టన్‌ కల నెరవేరలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement