టీమిండియా మాజీ సారథి కోహ్లీపై మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ జట్టుకు కోహ్లీ కెప్టెన్‌గా ఉంటే.. ఐపీఎల్‌లో ఆ జట్టు కథ ఎప్పుడో ముగిసేదన్నాడు. రాజస్థాన్ విజయాల్లో కొత్త కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌తో పాటు ఆ జట్టు హెడ్ కోచ్ సంజయ్ బంగర్ పాత్ర ఎంతో ఉందన్నాడు. వారిద్దరి కారణంగానే.. ఆర్‌సీబీ ప్లే ఆఫ్ వరకు వెళ్లిందన్నాడు. జట్టులో ఎలాంటి కొత్త మార్పులు చేయకుండానే.. ఎంతో బాగా రాణించిందని గుర్తు చేశాడు.
ఒక ఆటగాడు 2-3 మ్యాచులు ఆడకపోతే.. కోహ్లీ వారిని తప్పించేవాడు అని, కానీ బంగర్, డుప్లెసిస్ మాత్రం అలాంటి వారిపై ఎంతో నమ్మకం పెట్టుకుని ఆడించారన్నారు. ఇది ఆర్‌సీబీ ప్లే ఆఫ్ చేరుకోవడానికి కారణమన్నారు. సంజయ్ బంగర్ హెడ్ కోచ్‌గా రావడంతో జట్టుకు ఎంతో కలిసి వచ్చిందని తెలిపాడు. గత సీజన్‌లతో పోలిస్తే.. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ జట్టు ఎంతో బలంగా కనిపించిందని వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..