అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్‌శర్మ హాఫ్‌సెంచరీల రికార్డును మాజీ కెప్టెన్ కోహ్లీ సమం చేశాడు. శుక్రవారం విండీస్‌తో జరిగిన రెండో టీ20లో కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు. కోహ్లీ రెండోటీ20లో 52పరుగులు చేసి 30వ హాఫ్‌సెంచరీని నమోదు చేశాడు. ఈక్రమంలో రోహిత్ 30హాఫ్‌సెంచరీల రికార్డుకు చేరువయ్యాడు. ఇప్పటివరకూ విరాట్ కోహ్లీ 96 అంతర్జాతీయ టీ20ల్లో 51.5 సగటుతో 3296 పరుగులు సాధించాడు. వీటిలో 30 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. అయితే కోహ్లీ టీ20ఖాతాలో ఒక్క సెంచరీ కూడా లేదు. అత్యధిక స్కోరు 94. ఐపీఎల్‌లో కోహ్లీ మొత్తం 6283పరుగులుతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టీ20ఫార్మాట్‌లో మొత్తం 10వేల పరుగులు పూర్తి చేసుకున్న ఏకైక భారత ఆటగాడు కోహ్లీ మాత్రమే. కాగా అంతర్జాతీయంగా టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో క్రిస్‌గేల్ 14,529 టాపర్‌గా ఉన్నాడు. షోయబ్‌మాలిక్ 11,611, పొలార్డ్ 11,419, ఫించ్ 10,434, వార్నర్ 10,308 టాప్-5లో ఉండగా వీరి తర్వాత ఆరోస్థానంలో కోహ్లీ ఉన్నాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..