Thursday, September 19, 2024

Ronaldo | సోషల్‌ మీడియాను షేక్‌ చేసిన ఫుట్‌బాల్‌ దిగ్గజం !

ఫుట్‌బాల్‌ అనగానే ముందు గుర్తుకొచ్చే పేరు క్రిస్టియానో రొనాల్డో.. పోర్చుగల్‌కు చెందిన ఈ దిగ్గజ సాకర్‌ స్టార్‌ ఇప్పుడు మొత్తం సోషల్‌ మీడియాను షేక్‌ చేశాడు. సోషల్‌ మీడియాలో అత్యధిక పాలోవర్స్‌ కలిగి ఉన్న రొనాల్డో ఇప్పుడు సరికొత్త చరిత్ర సృష్టించాడు. సోషల్‌ మీడియాలో రొనాల్డోను అనుసరించే ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 100 కోట్లు దాటింది.

దీంతో మొత్తం ప్రపంచలోనే ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా క్రిస్టియానో రొనాల్డో కొత్త ఘనత సాధించాడు. ఈ విషయాన్ని తాజాగో రొనాల్డో తన అభిమానులతో పంచుకున్నాడు. మనం చరిత్ర సృష్టించాము. 1 బిలియన్‌ (100 కోట్లు) ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాము.

ఇది సంఖ్య మాత్రమే కాదు… కోట్లాది మంది ప్రేమకు, అభిమానానికి నిదర్శనం. మడైరా వీధుల నుంచి ప్రపంచ వేదికల వరకు.. నేను ఎల్లప్పుడు నా కుటుంబంతో పాటు మీ కోసమే ఆడాను. నా జీవితంలో భాగమైనందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా.. అని రొనాల్డో రాసుకొచ్చాడు.

ఇక ఇటీవల ..యువర్‌ క్రిస్టియానో.. అనే పేరుతో తన యూటూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించిన రొనాల్డో.. ఆరంభించిన కొద్ది గంటల్లోనే (1 మిలియన్‌) కోటి మంది సస్క్రైబర్స్‌ను పొంది సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడి యూట్యూబ్‌ ఖాతాకు 6 కోట్లకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. క్రిస్టియానోకు ఇన్‌స్టాలో ఏకంగా 63.9 కోట్ల మంది, ఫేస్‌బుక్‌లో 17 కోట్ల మంది, ఎక్స్‌లో 11.3 కోట్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement