ఐపీఎల్ మీడియా హక్కుల వేలానికి అనూహ్య స్పందన వచ్చిన నేపథ్యంలో ఐసీసీ మీడియా హక్కులపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. జూన్ 20న సోమవారం నుంచి ఐసీసీ మీడియా హక్కులకు సంబంధించి టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 2015 నుంచి 2023 వరకు 8ఏళ్ల కాలానికి ఐసీసీ మీడియా హక్కులను 2 బిలియన్ డాలర్లకు డిస్నీ స్టార్ ఇండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పుడే రెట్టింపు ఆదాయం రాగా, ఇప్పుడు అంతకు మించి రాబడి వచ్చే అవకాశముందని ఐసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2007- 2014మధ్య కాలానికి ఐసీసీ మీడియా హక్కులను ఈఎస్‌పీఎన్ స్పోర్ట్స్ 1.1 బిలియన్ డాలర్లకు దక్కించుకోగా, 2015-2023 కాలానికి డిస్నీ స్టార్ ఇండియా 2 బిలియన్ డాలర్లకు చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.ఈసారి మెన్స్ అండ్ ఉమెన్స్ క్రికెట్ రైట్స్ వేర్వేరుగా విక్రయించాలని ఐసీసీ భావిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించారు. ఐపీఎల్ మీడియా హక్కుల వేలానికి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో ఇదే సరైన సమయమని ఐసీసీ భావిస్తూ… ఐసీసీ మీడియా హక్కుల టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఐసీసీ మీడియా రైట్ వేలం ప్రక్రియలో డిస్నీ స్టార్ ఇండియా నుంచి నెట్‌ఫిక్స్‌తో పాటు ఆపిల్, అమెజాన్, వయాకామ్ 18, సోని పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (ఎస్‌పీఎన్‌ఐ), జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఈఈఎల్) పోటీపడనున్నాయి. ఐసీసీ డిజిటల్ రైట్స్ కూడా నెట్‌ఫ్లిక్స్, ఆపిల్, అమెజాన్ టెండర్ వేయనున్నట్లు సమాచారం.
2024 నుంచి 2031 వరకు మెన్స్, ఉమెన్స్ క్రికెట్ టోర్నమెంట్‌లకు సంబంధించి ఐసీసీ బోర్డు గత ఏడాది షెడ్యూల్‌ను ఖరారు చేసింది. మెన్స్ క్రికెట్‌కు సంబంధించి 4 టీ20 వరల్డ్ కప్స్ ఇందులో ఇందులో 2 క్రికెట్ వరల్డ్ కప్స్, 2 చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్స్ షెడ్యూల్స్ ఖరారయ్యాయి. అలాగే 4 వరల్డ్ టెస్ట్ చాంపియన్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ షెడ్యూల్ విడుదలైంది. ఇక ఉమెన్స్ క్రికెట్ విషయానికొస్తే… 4 టీ20 వరల్డ్ కప్స్, అందులో 2 క్రికెట్ వరల్డ్ కప్స్, మరో 2 టీ20 చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్స్ షెడ్యూల్స్‌ను ఐసీసీ ఖరారు చేసిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.