Tuesday, December 10, 2024

Vijay Merchant Trophy | డీవీఆర్, సీపీ గ్రౌండ్లలో పరుగుల వరద..

  • రాజస్థాన్ 618/4
  • ఉత్తరాఖండ్ 399/7

ఇబ్రహీంపట్నం, (ఆంధ్రప్రభ): మూలపాడు గోకరాజు లైలా గంగరాజు క్రికెట్ స్టేడియంలో విజయ్ మర్చంట్ ట్రోఫీ గ్రూప్ – డీ క్రికెట్ మ్యాచ్ లు శుక్రవారం ప్రారంభమయ్యాయి. డీవీఆర్ గ్రౌండ్ లో అండర్ – 16 రాజస్థాన్ – జార్ఖండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి రోజు 90 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 618 పరుగులు చేసింది. రాజత్ భాగేల్ (307 బంతుల్లో 266 పరుగులు), యదార్థ్ భరద్వాజ్ (209 బంతుల్లో 116 పరుగులు) చేశారు. జార్ఖండ్ బౌలర్లు ఆయుష్ 92/1 పరుగులు, ధీరజ్ 64/1 పరుగులు, జీవన్ కుమార్ పటేల్ 93/1 పరుగులు, మన్మీత్ సాగర్ 54/1 పరుగులిచ్చారు.

సీపీ గ్రౌండ్ లో ఉత్తరాఖండ్ – జమ్ము అండ్ కాశ్మీర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఉత్తరాఖండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఉత్తరాఖండ్ మొదటి ఇన్నింగ్స్ లో 88 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. ఆదిత్య నౌటియల్ 238 బంతుల్లో (4×25, 6×4) 171 పరుగులు, మయాంక్ ముడిల 112 బంతుల్లో (4×17) 93 పరుగులు చేశారు. జమ్ము అండ్ కాశ్మీర్ బౌలర్ షా ఫర్హాన్ 22 ఓవర్లలో 110 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement