చిన్నస్వామి స్టేడియంలో భారత ఇన్నింగ్స్ ముగిసింది. నాలుగో రోజు సర్ఫరాజ్ ఖాన్(150) భారీ శతకం, రిషభ్ పంత్(99) విధ్వంసక బ్యాటింగ్‌తో కోలుకున్న టీమిండియా అనూహ్యంగా ఆఖరి సెషన్‌లో ఆలౌటయ్యింది. న్యూజిలాండ్ పేసర్లు విలియం ఓ రూర్కీ , మ్యాట్ హెన్రీ , విజృంభణతో టీ సెషన్ తర్వాత 462 పరుగులకే రోహిత్ సేన కుప్పకూలింది. చివరి ఏడు వికెట్లను కేవలం 57 పరుగులు మాత్రమే భారత్ కోల్పోవడం విశేషం.. పంత్ అవుటైన తర్వాత మిగిలిన బ్యాటర్లు వరసగా పెవిలియన్ కు చేరారు.. దీంతో ఇండియా 106 పరుగుల ఆధిక్యం సాధించింది.. ఈ లక్ష్య చేదనకు కివీస్ బ్యాటింగ్ కు దిగింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement