Monday, November 25, 2024

First Test – భార‌త్ పేస్ కు అసీస్ విల‌విల‌ …. తొలి రోజు స్కోర్ ఎంతంటే

పెర్త్ వేదిక‌గా భార‌త్ తో జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ పీక‌లోతు క‌ష్టాల‌లో ప‌డింది.. భార‌త్ పేస్ త్ర‌యం బుమ్రా, సిరాజ్, హ‌రిత్ రానాలో బౌలింగ్ టాప్ బ్యాట్స్ మెన్ లు అంద‌రూ చేతులేత్తేశారు… ఇండియాను 150 ప‌రుగుల‌కే అలౌట్ చేశామ‌న్న ఆనందం అసీస్ కు మిగ‌ల‌కుండానే మ‌న బౌల‌ర్లు వారిని దెబ్బ తీశారు.. తొలి రోజు ఆట ముగిసే స‌మయానికి అసీస్ ఏడు వికెట్ల న‌ష్టానికి 67 ప‌రుగులు చేసింది.. క్రీజ్ లో క్యారీ 19, మిచెల్ స్టార్క్ 6 ప‌రుగుల‌తో ఆడుతున్నారు..

అంత‌కు ముందు అసీస్ బౌల‌ర్లు బుమ్రా ధాటికి ఒక‌రి త‌ర్వాత మ‌రోక‌రు పెవిలియ‌న్ కు చేరారు.. ముందుగా ఓపెనర్ మెక్స్వినీని బుమ్రా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తొలుత అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. భారత్ డీఆర్ఎస్ తీసుకుంది. సమీక్షలో అతను ఔటైనట్లు తేలింది. బుమ్రా కాసేపటికే వరుస బంతుల్లో ఉస్మాన్ ఖావాజా, స్టీవ్ స్మితన్ను పెవిలియన్కు పంపాడు. అద్భుతమైన బంతికి ఖవాజా స్లిప్లో కోహ్లికి దొరికిపోగా.. స్మిత్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అతను కనీసం సమీక్ష కూడా తీసుకోకుండానే పెవిలియన్కు వెళ్లిపోయాడు. డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (11)ను అరంగేట్ర ఆటగాడు హర్షిత్ రాణా క్లీన్ బౌల్డ్ చేశాడు. తర్వాత సిరాజ్ కూడా ఊపందుకున్నాడు. అతడి బౌలింగ్ మిచెల్ మార్ష్ (6) స్లిప్ లో కేఎల్ రాహుల్కు చిక్కాడు. తొలుత అంపైర్లకు క్యాచ్ పై అనుమానం ఉన్నప్పటికీ.. రివ్యూలో సరైందిగా తేలింది. క్రీజులో పాతుకుపోయిన మార లబుషేన్ (2)ను సిరాజ్ ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. కొద్దిసేపటికే ఆసీస్ కెప్టెన్ కమిన్స్ (3).. బుమ్రా బౌలింగ్ వికెట్ కీపర్ పంత్కు క్యాచ్ ఇచ్చాడు.

జ‌స్ప్రీత్ బుమ్రా (4/17), మ‌హ్మ‌ద్ సిరాజ్(2/17). హ‌ర్షిత్ రాణా(1/33)లకు వికెట్లు ల‌భించాయి. పెర్త్ పిచ్ పేస్ బౌల‌ర్ల‌కు అనుకూలించ‌గా ఇరుజ‌ట్ల స్పీడ్‌స్ట‌ర్లు రెచ్చిపోయారు. ఇంకేముంది ఒక్క‌రోజే 17 వికెట్లు ప‌డ్డాయి.

- Advertisement -

అంత‌కు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్ ఆసీస్ బౌల‌ర్ల ధాటికి విల‌విల‌లాడింది. టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 49.4 ఓవ‌ర్ల‌లో 150 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. భార‌త బ్యాట‌ర్ల‌లో నితీశ్ రెడ్డి (41), రిష‌బ్ పంత్ (37), కేఎల్ రాహుల్ (26) లు ఫ‌ర్వాలేద‌నిపించారు. మిగిలిన వారిలో ధ్రువ్ జురెల్ (11) ఒక్క‌డే రెండు అంకెల స్కోరు చేయ‌గా అంతా సింగిల్ డిజిట్ కే ప‌రిమితం అయ్యారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో జోష్ హేజిల్ వుడ్ నాలుగు వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్‌, మిచెల్ మార్ష్, పాట్ క‌మిన్స్ లు త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్, వ‌న్‌డౌన్ బ్యాట‌ర్ దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ లు ప‌రుగుల ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరుకున్నారు. ఆదుకుంటాడ‌ని భావించిన సీనియ‌ర్ ఆట‌గాడు కోహ్లీ సైతం 5 ప‌రుగుల‌కే ఔట్ అయ్యాడు. ఆరంభం నుంచి ఆసీస్ బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్న కేఎల్ రాహుల్ థ‌ర్డ్ అంపైర్ వివాదాస్ప‌ద నిర్ణ‌యంతో పెవిలియ‌న్‌కు చేరుకోగా ధ్రువ్ జురెల్ (11), వాషింగ్ట‌న్ సుంద‌ర్‌ (4)లు విఫ‌లం అయ్యారు. దీంతో భార‌త్ 73 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ దశ‌లో సీనియ‌ర్ ఆట‌గాడు రిష‌బ్ పంత్‌తో క‌లిసి తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న నితీశ్ రెడ్డి ఆదుకున్నాడు. వీరిద్ద‌రు ఏడో వికెట్ 48 ప‌రుగులు జోడించి జ‌ట్టును స్కోరు వంద ప‌రుగులు ధాటించారు. పంత్ ఔటైన త‌రువాత జ‌ట్టు ఆలౌట్ కావ‌డానికి ఎంతో సేపు ప‌ట్ట‌లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement