Saturday, November 23, 2024

శ్రీ‌లంక‌తో ఫ‌స్ట్ టీ 20.. భారీ స్కోరుతో భార‌త్ విజ‌యం..

లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబర్చిన భారత్ జట్టు 62 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాదించింది. మ్యాచ్‌లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఇషాన్ కిషన్ 56 బంతుల్లో 10 ఫోర్లు, 3సిక్సర్లతో 89 పరుగులు చేశాడు., శ్రేయాస్ అయ్యర్ 28 బంతుల్లో 57 (5 ఫోర్లు, 2 సిక్సులు) చేసి 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ టార్గేట్ ని ఇచ్చింది ఇండియా. అనంతరం లక్ష్య ఛేదనలో తడబడిన శ్రీలంక జట్టు భార‌త బౌల‌ర్ల తాకిడికి త‌ట్టుకోలేక వ‌రుస వికెట్ల‌తో 137/6కే పరిమిమైంది. దాంతో.. మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో ఉండ‌గా.. రెండో టీ20 మ్యాచ్ శనివారం రాత్రి ధర్మశాల వేదికగా జరగనుంది. మ్యాచ్‌లో అంతకముందు టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ శనక మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. ఇషాన్ కిషన్‌తో కలిసి భారత్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన రోహిత్ శర్మ రెచ్చి పోయి ఆడారు..

ఓపెనర్ ఇషాన్ కిషన్, వన్ డౌన్ బ్యాట్స్ మన్ శ్రేయాస్ అయ్యర్ దంచి కొట్టడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 199 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇషాన్ కిషన్ 56 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 32 బంతుల్లో 44 పరుగులు చేసి లహిరు కుమార బౌలింగ్ లో అవుటయ్యాడు. కానీ.. ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో రోహిత్ శర్మ ఔటైపోగా.. అనంతరం వచ్చిన శ్రేయాస్ అయ్యర్ తొలుత కాస్త నెమ్మదిగా ఆడుతూ ఇషాన్ కిషన్‌కి సపోర్ట్‌ ఇచ్చాడు. కానీ.. సెంచరీ దిశగా దూసుకెళ్లిన ఇషాన్ కిషన్.. జట్టు స్కోరు 155 వద్ద ఔటవగానే శ్రేయాస్ అయ్యర్ గేర్ మార్చాడు. చివరి 14 బంతుల్లో ఏకంగా 40 పరుగులు చేశాడు. దాంతో.. ఆఖరి 4 ఓవర్లలో భారత్ ఏకంగా 52 పరుగుల్ని పిండుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement