భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈరోజు తొలి మ్యాచ్ జరిగింది. కాగా, బ్రిస్బేన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ సేన ఘోర పరాజయాన్ని చవిచూడగా… సిరీస్ లో ఆతిథ్య ఆసీస్ జట్టు బోణీ కొట్టంది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు.. తీవ్ర బ్యాటింగ్ వైఫల్యంతో 34.2 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జెమీమా రోడ్రిగ్స్ (23) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆసీస్ బౌలర్లలో మెగాన్ షట్ ఐదు వికెట్లతో చెలరేగగా… కిమ్ గార్త్, ఆష్లే గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, అలనా కింగ్ తలో వికెట్ తీశారు.
అనంతరం స్వల్ప లక్ష్యంతో చెజంగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియా… 16.2 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది. ఓపెనర్లు ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (35), జార్జియా వాల్ (46 నాటౌట్) ఇద్దరూ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఫలితంగా తొలి వన్డేలో ఆసీస్ జట్టు ఐదు వికెట్లతో విజయం సాధించి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.