లక్నోలో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలుత వెంటవెంటనే వికెట్లు కోల్పోయినా ఆ తర్వాత నిలదొక్కుకుంది. నిర్ణీత 40 ఓవర్లలో 4 వికెట్లకు 249 పరుగులు చేసింది. అయితే ఆ జట్టును క్వింటన్ డికాక్ (48) పరుగులతో ఆదుకున్నాడు. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసేన్74, డేవిడ్ మిల్లర్75 పరుగులతో తమదైన శైలిలో ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో బెటర్ స్కోరు చేయగలిగింది సఫారీ జట్టు. దీంతో ఇండియా టార్గెట్ 250 పరుగులు చేయాల్సి ఉంది..
ఇక.. టీమిండియా బౌలర్ కుల్దీప్ 16వ ఓవర్‌లో వేసిన చివరి బంతిని ఆడిన మక్రాం బౌల్డ్ అయ్యాడు. అప్పటికి దక్షిణాఫ్రికా స్కోర్ 74 పరుగులు మాత్రమే ఉంది. అంతకుముందు 15వ ఓవర్‌లో సఫారీలు రెండో వికెట్ కోల్పోయారు. 15వ ఓవర్‌లో చివరి బంతిని వేసిన ఠాకూర్.. క్రీజ్‌లో ఉన్న బావుమాను క్లీన్‌బౌల్డ్ చేశాడు.
javascript:false దీనికి ముందు కూడా13వ ఓవర్‌లో సౌతాఫ్రికా జట్టు 49 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 13వ ఓవర్‌లో ఠాకూర్ వేసిన తొలి బంతిని ఆడిన జన్నెమాన్ మలాన్ ఔటయ్యాడు. ఆ బంతిని శ్రేయస్ అయ్యర్ క్యాచ్ పట్టడంతో సఫారీలు తొలి వికెట్‌ను కోల్పోయారు.
ఇప్పటికే టీ-20 సిరీస్‌ను సొంతం చేసుకున్న టీం ఇండియా.. మరో సిరీస్‌పై కన్నేసింది. గురువారం తొలుత షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కావాల్సిన వన్డే మ్యాచ్.. వరుణుడు అడ్డంకిగా మారడంతో వాయిదా పడుతూ వచ్చింది. వర్షం నేపథ్యంలో వన్డే మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. టీమిండియాకు ప్రస్తుతం శిఖార్ ధావన్ సారధ్యం వహిస్తున్నాడు.