Monday, July 1, 2024

T20WC | అడుగు దూరంలో ఫైనల్స్‌.. టీమిండియాలో ఆ ఒక్క మార్పు త‌ప్ప‌దా…

టీ20 ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. మరికొద్ది గంటల్లో రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ పోటీ పడుతుండగా.. రెండో మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్ తలబడనున్నాయి. గయానా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌కు ముందుగా టీమిండియా జట్టులో కీలక మార్పులు ఉండొచ్చునన్న వస్తున్నాయి.

టోర్నీలో ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పెద్దగా అంచనాలు అందుకోలేదు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో వరుసగా ఫెయిల్ అవుతూనే వచ్చాడు. దీంతో విరాట్ కోహ్లీ స్థానంలో యశస్వి జైస్వాల్‌ను ఓపెనర్‌గా తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోని టీమిండియా.. కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో తలబడనుంది. 2022లో ఇదే టీమ్‌తో తలబడిన టీమిండియా.. ఆ టోర్నీలో ఘోర ఓటమిపాలైంది. దీంతో ఈసారి రివెంజ్ తీర్చుకోవాలని కసితో ఉంది రోహిత్ సేన. అందుకే స్ట్రాంగ్ ప్లేయర్స్‌తో బరిలోకి దిగాలని ప్రణాళికలు రచిస్తోంది.

ఓపెనింగ్‌లో కోహ్లీ పూర్తిగా పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. మొన్న ఆసీస్‌పై కూడా విరాట్ డకౌట్ అయ్యాడు. టోర్నీ ఇది అతడికి రెండో డక్. ఇప్పటివరకు కోహ్లీ కేవలం 11 యావరేజ్‌తో కేవలం 66 పరుగులే చేశాడు. కాబట్టి కోహ్లీని ఎప్పటిలానే మూడో స్థానంలో దింపి.. జైస్వాల్‌ను ఓపెనర్‌గా బరిలోకి దింపనున్నారట. ఆల్‌రౌండర్ శివమ్ దూబే స్థానంలో జైస్వాల్ తుది జట్టులోకి వచ్చే అవకాశముందట. ఈ ఒక్క మార్పు మినహా.. మిగతా టీం.. సేమ్ టూ సేమ్ కొనసాగనుంది.

టీమిండియా జట్టు(అంచనా):

రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే/యశస్వి జైస్వాల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా.

Advertisement

తాజా వార్తలు

Advertisement