ఎఫ్‌ఐహెచ్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో భారతీయ పురుషుల జట్టు నాలుగో ర్యాంకుకు పడిపోగా.. మహిళల జట్టు ఆరో స్థానానికి ఎగబాకింది. 2842.258 పాయింట్లతో ఆస్ట్రేలియా మహిళల జట్టు టాప్‌లో కొనసాగుతున్నది. 3049.495 పాయింట్లతో నెదర్లాండ్స్ జట్టు రెండో స్థానంలో ఉంది. ఇక పురుషుల కేటగిరిలో నెదర్లాండ్స్ జట్టు 2465.707 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న భారత్‌ను నాల్గో స్థానానికి నెట్టేసి 3వ ర్యాంకులో కొనసాగుతున్నది. ఇక భారత్ పురుషుల జట్టు 2366.990 పాయింట్లతో నాల్గో స్థానంలో ఉంది. ఆ తరువాత జర్మనీ 2308.156 పాయింట్లతో ఐదో స్థానంలో, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా జట్లపై గెలిచిన ఇంగ్లండ్ జట్టు 2171.354 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.
2147.179 పాయింట్లతో అర్జెంటీ నా ఏడో స్థానంలో, 1798.247 పాయింట్లతో న్యూజిలాండ్ 8వ స్థానంలో, స్పెయిన్ 1779.462 పాయింట్లతో 9వ స్థానంలో, 1704.115 పాయింట్లతో మలేషియా 10వ స్థానంలో ఉంది. మహిళల ర్యాంకుల విషయంలో.. ఆస్ట్రేలియా 2440.750 పాయింట్లు, ఇంగ్లండ్ 2204.590 పాయింట్లు, జర్మనీ 2201.085 పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక భారత్ 2029.396 పాయింట్లతో ఆరో స్థానానికి ఎగబాకగా.. అప్పటి వరకు 6వ ర్యాంకులో ఉన్న స్పెయిన్ 2016.149 పాయింట్లతో ఏడో స్థానానికి పడిపోయింది. బెల్జియం 1991.089 పాయింట్లతో 8వ ర్యాంకులో, 1914.412 పాయింట్లతో న్యూజిలాండ్ 9వ స్థానంలో, జపాన్ 1800.350 పాయింట్లతో పదో స్థానంలో కొనసాగుతున్నది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..