లండన్ వేదికగా జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ హాకీ టోర్నీలో భారత పురుషుల జట్టు వరల్డ్ చాంపియన్ జర్మనీపై సంచలన విజయం సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-0 గోల్స్ తేడాతో జర్మనీని చిత్తుగా ఓడించింది. మ్యాచ్ ఆరంభంలోనే (16వ) నిమిషంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ కళ్లు చెదిరే గోల్‌తో భారత్ ఖాతా తెరిచాడు.
అనంతరం రెండో హాఫ్లోనూ భారత ఆటగాళ్లు జోరు కనబర్చారు. 41వ నిమిషలంలో సుఖ్జీత్ సింగ్, 44వ నిమిషంలో గుర్జంత్ సింగ్ బ్యాక్ టు బ్యాక్ గోల్స్ నమోదు చేయడంతో టీమిండియా 3-0తో భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
భారత్ డిఫెన్స్ విభాగం కూడా ప్రత్యర్థి గోల్స్ ప్రయత్నాలను ధీటుగా ఎదుర్కొవడంతో జర్మనీ ఒక్క గోల్ కూడా చేయలేక పోయింది. ఆఖరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత్ భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో భారత్ (24 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్, అర్జెంటీనాలు వరుసగా టాప్-2లో నిలిచాయి.