మహిళల టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆదివారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అయితే ఈసారి పాక్ జట్టుకు నిదా దార్ స్థానంలో పేసర్ ఫాతిమా సనా సారథ్య బాధ్యతలు చేపట్టనుంది. వరల్డ్‌కప్‌లో పాల్గొనే పాక్ జట్టుకు కెప్టెన్‌గా ఫాతిమా సనాను నియమించినట్లు పీసీబీ తెలిపింది.
ఈ 22 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ ఫాతిమాకు గతంలో దేశవాళీ జట్లకు సారథ్యం వహించిన అనుభవం ఉంది. మరోవైపు నిదా గైర్హాజరీలోనూ కొన్ని మ్యాచుల్లో పాక్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. పేసర్ తస్మియా రుబాబ్ తొలిసారి పాక్ జట్టులో చోటు దక్కించుకుంది.
కాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్-2024 ఇటీవలే బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి మారిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లో అల్లర్ల కారణంగా ఈ మెగాటోర్నీని యూఏఈకి తరలించారు. ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి 30 వరకు ఈ విశ్వకప్ సమరం జరుగనుంది.
టీ20 వరల్డ్‌కప్ పాకిస్తాన్ జట్టు : ఫాతిమా సనా (కెప్టెన్), ఆలియా రియాజ్, డయానా బేగ్, గుల్ ఫిరోజా, ఇరమ్ జావేద్, మునీబా అలీ (వికెట్ కీపర్), నష్రా సాంధూ, నిదా దార్, ఒమైమా సోహైల్, సదాఫ్ షమాస్, సాదియా ఇక్బాల్, సిద్రా అమీన్, సయ్యదా అరూబ్ షా, తస్మియా రుబాబ్, తుబా హసన్.
ట్రావెలింగ్ రిజర్వ్: నజిహా అలీ (వికెట్ కీపర్).
నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లు: రమీన్ షమీమ్, ఉమ్-ఎ-హాని.