Monday, November 18, 2024

తండ్ర‌యిన టెన్నిస్ ఆట‌గాడు ర‌ఫెల్ నాద‌ల్

తొలిసారి తండ్ర‌య్యాడు టెన్నిస్ దిగ్గ‌జ ఆట‌గాడు ర‌ఫెల్ నాద‌ల్.స్పెయిన్ బుల్ నాద‌ల్ భార్య మ‌రియా ఫ్రాన్సిస్కా పెరెలో మగబిడ్డకు జన్మనిచ్చింది. త‌మ కొడుకుకు ర‌ఫెల్ అని పేరు పెట్టిన‌ట్టు తెలుస్తోంది. నాదల్, మరియా 2019లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం నాద‌ల్ వ‌య‌సు 36 ఏళ్లు. టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో అత్య‌ధికంగా 22 గాండ్ స్లామ్స్ సాధించి రికార్డు నెల‌కొల్పాడు. ఏటీపీ పురుషుల ర్యాంకింగ్ లో నాదల్ రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. మొద‌టి స్థానంలో స్పెయిన్‌కే చెందిన య‌వ సంచలనం కార్లోస్ అల్క‌రాజ్ గార్సియా ఉన్నాడు. తండ్ర‌యిన నాద‌ల్‌కు సెర్బియా టెన్నిస్ వీరుడు నొవాక్ జొకోవిచ్ శుభాకాంక్షలు తెలిపాడు. “కంగ్రాట్. నాకు ఇప్పటిదాకా తెలియదు. అది అద్భుత‌మైన వార్త‌. నాద‌ల్‌, అత‌ని భార్య‌, బిడ్డ ఆరోగ్యం, సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్నా. ఒక తండ్రిగా నేను అతనికి ఎటువంటి సలహా ఇవ్వను (నవ్వుతూ). ఆయనకు పెద్ద కుటుంబం ఉంది. నాద‌ల్‌ తనను తాను అనుభూతి చెందుతాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను (నవ్వుతూ)” అని ట్వీట్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement