ఆసియా కప్‌లో భారత్ విజయకేతనం ఎగరేసింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ పోరులో 50 ఓవర్ల మ్యాచ్‌ని ఆరు ఓవర్లలోనే ఫసక్ అనిపించారు భారత బ్యాటర్లు. దీంతో అభిమానులు ఆసియా కప్ మనదే బిగిలు అనుకుంటూ సంబురాలు చేసుకుంటున్నారు. కాగా, ఆదిలోనే శ్రీలంకను బ్యాట్ లేపకుండా కట్టడిచేసిన బౌలర్లకు తోడు వికెట్ కూడా పడిపోకుండా టీమిండియా ఘనాతి ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌కు ముందు అందరూ టెన్షన్‌కు గురయినా.. భారత బౌలర్ల విజృంభణతో ఆట స్వరూపం పూర్తిగా మారిపోయింది. కేవలం 15 ఓవర్లలోనే లంకను పెవిలియన్‌కు పంపిన భారత జట్టు.. ఆ తర్వాత చేజింగ్‌లోనూ సత్తాచాటింది. కేవలం 6 ఓవర్లలోనే స్వల్ప టార్గెట్‌ని అలవోకగా చేధించి విజయం సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు మొత్తం 16 సీజన్ల ఆసియాకప్‌లో ఈ మ్యాచ్ విజయంతో టీమిండియాకు 8వ ఆసియా కప్ సొంతం చేసుకోవడం మరో రికార్డు…
ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ దూకుడుగా ఆడారు. ఇషాన్ 23, గిల్ 27 పరుగులతో ఆకట్టుకున్నారు. దీంతో 50 పరుగుల టార్గెట్‌ని ఈజీగా చేజ్ చేసి.. వికెట్ పడిపోకుండా 51 పరుగులు సాధించారు. దీంతో టీమిండియా 10 వికెట్ల విజయాన్ని సొంతం చేసుకుంది..