జింబాబ్వే క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ . దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రీక్ చనిపోయారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. స్ట్రీక్ మరణ వార్తతో క్రికెట్ ప్రేమికులు ఆవేదనకు గురయ్యారు. అయితే చనిపోయారనే వార్తను హీత్ స్ట్రీక్ ఖండించారు.. తాను బతికే ఉన్నానంటూ ఒక ప్రకటన విడుదల చేశారు.. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. తాను చనిపోయాననేది పెద్ద రూమర్ అని అన్నారు. తాను బతికి ఉన్నానా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించుకోకుండానే ప్రచారం చేశారని విమర్శించారు. ఈ వార్తలతో తాను హర్ట్ అయ్యానని చెప్పారు.
ఈ వార్తను ప్రచారం చేసిన వారు తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 49 ఏళ్ల హీత్ స్ట్రీక్ 31 ఏళ్ల వయసులో 2005లో క్రికెట్ కు వీడ్కోలు పలికారు. టెస్టుల్లో 100కు పైగా, వన్డేల్లో 200కు పైగా వికెట్లు పడగొట్టిన ఏకైన జింబాబ్వే బౌలర్ గా స్ట్రీక్ ఘనత సాధించాడు. 2000 సంవత్సరంలో ఆయన జింబాబ్వే జట్టుకు సారధ్యం వహించాడు.