బెంగళూరులో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో ఇవ్వాల (సోమవారం) రాత్రి చెన్నై, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ధోనీ సేన చెలరేగి ఆడడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది.
ఇందులో.. కాన్వే (83), రహానే (37), శివం దూబే (52) పరుగులతో అభిమానులకు అలరించారు. సిక్స్‌లు, ఫోర్లతో మోత మోగించారు. దీంతో చెన్నై పటిష్టమైన పరుగుల చేయగలిగింది.. ఇక.. సిరాజ్, పార్నెల్, విజయ్‌కుమార్, హసరంగా, హర్షల్ పటేల్‌కు తలా ఒక వికెట్ దక్కింది..
కాగా, బెంగళూరు టార్గెట్ 237 ఉండగా.. బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ (6) తొలి ఓవర్లోనే అవుటయ్యాడు. ఆ తర్వాత డూప్లీసెస్ (62), మ్యాక్స్‌వెల్ (76) కలిసి వీర బాదుడు బాదారు. ఓ క్రమంలో బెంగళూరు ఈజీగా గెలుస్తుందనే ధీమా బెంగళూరు అభిమానుల్లో వ్యక్తం అయ్యింది. అయితే.. ఆ తర్వాత వీరిద్దరి భాగస్వామ్యం బ్రేక్ కావడంతో బెంగళూరు కష్టాల్లో పడింది. కాస్త దినేష్ కార్తీక్ పర్వాలేదు అనిపించినా.. అతని అవుట్ తర్వాత అంతలా ఆదుకునే వారు లేక చతికిల పడింది. ఎనిమిది వికెట్లు కోల్పోయి ఎనిమిది పరుగుల తేడాతే చెన్నైపై బెంగళూరు ఓటమి చెందింది.