Monday, November 25, 2024

సెలెక్ట‌ర్ల‌పై టీమిండియా మాజీ హెడ్ కోచ్ షాకింగ్ కామెంట్స్..

గాయం కారణంగా రెండేళ్లుగా బౌలింగ్‌ చేయలేకపోతున్న ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యాకి టీ20 వరల్డ్‌ కప్‌ 2021 టోర్నీ జట్టులో చోటు కల్పించడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై తాజాగా స్పందించాడు భారత మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి… ‘మెగా టోర్నీల్లో ఐదుగురు బౌలర్ల ఫార్ములాతో బరిలో దిగితే గెలవడం చాలా కష్టం. హార్ధిక్‌ పాండ్యా తరుచూ గాయపడుతూ ఉండడంతో అతనికి సరైన రిప్లేస్‌మెంట్‌ ప్లేయర్‌ని వెతకాల్సిన సెలక్టర్లకు చెబుతూ వచ్చాం… అయితే సెలక్టర్లు మాత్రం మా గోడు పట్టించుకోలేదు. సరైన ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అందుబాటులో లేకపోవడం వల్లే మేం రెండు వరల్డ్‌ కప్స్‌లో ఓడిపోవాల్సి వచ్చింది..

హార్ధిక్‌ పాండ్యా పూర్తి ఫిట్‌గా ఉన్నా, లేక మేం కోరిన పేస్‌ ఆల్‌రౌండర్‌ని సెలక్టర్లు, ఎంపిక చేసినా ఇప్పటికి రెండు వరల్డ్‌ కప్స్‌ గెలిచేవాళ్లం… ఓ రకంగా 2019 వన్డే వరల్డ్‌ కప్‌లో, 2021 టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా ఓటమికి సెలక్టర్లే కారణం…’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు భారత మాజీ హేడ్‌ కోచ్‌ రవిశాస్త్రి… బెన్‌ స్టోక్స్‌ వన్డేల నుంచి తప్పుకున్న తర్వాత హార్ధిక్‌ పాండ్యా కూడా త్వరలోనే ఈ నిర్ణయం తీసుకోబోతున్నాడని, వన్డే వరల్డ్‌ కప్‌ తర్వాత అతన్ని వన్డేల్లో చూడడం కష్టమేనని రవిశాస్త్రి చేసిన కామెంట్లు సంచలనం క్రియేట్‌ చేస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement