వచ్చే ఏడాది మార్చిలో మహిళల ఐపీఎల్ తొలి సీజన్ ప్రారంభం కానుంది. తొలి సీజన్లో ఐదు జట్లను చేర్చనున్నారు. ఈ జట్లను ఎలా ఎంపిక చేయాలనే దానిపై కూడా బిసిసిఐలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మహిళల టి 20 చాలెంజ్‌ను ప్రవేశ పెట్టినప్పటి నుండి మహిళల ఐపిఎల్ ఫుల్ సీజన్‌కు నిరంతరం డిమాండ్ వినిపిస్తూనే ఉంది. అయితే ఈ క్రమంలో ఈ ఏడాది అభిమానులకు గొప్ప వార్తను బిసిసిఐ అందించింది. మహిళల ఐపిఎల్‌కు సం భంధించిన రోడ్ మ్యాప్ పూర్తిగా సిద్దమైందని, వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కావచ్చని బీసీసీఐ పేర్కొంది. తాజాగా మహిళల ఐపిఎల్‌కు సంబంధించిన మరి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అందులో జట్టు వేదిక, మ్యాచ్‌ల గురించి సమాచారం అందించింది.
పురుషుల ఐపిఎల్‌లో మాదిరిగా జోన్ (నార్త్, సౌత్, సెంట్రల్, ఈస్ట్, నార్త్ ,ఈస్ట్ , వెస్ట్ ) లేదా నగరాల వారిగా (చెన్నయ్, ఢిల్లి, ముంబై, బెంగుళూరు, కోల్ కతా) జట్లను విభజించడంలో బోర్డుతో ఉన్న మొదటి ఎంపికగా పేర్కొంటున్నారు. ఐదు జట్లకు ఎన్ని వేదికలు ఉంటాయో నిర్ణయించాల్సి ఉంది. ఐదు జట్లు 20 లీ గ్ మ్యాచులు ఆడనున్నాయి. అన్ని జట్లు ఒకదానితో ఒకటి రెండుసార్లు తలపడనున్నాయి. ఏ జట్టు అగ్రస్థానంలో ఉందో ఆ జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుండగా, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్‌ను ఆడతాయి. ఇక్కడ ప్రతి జట్టు 5గురు విదేశీ ఆటగాళ్లను కలిగి ఉండటానికి అనుమతించనున్నారు. ఇందులో నలుగురు ఆటగాళ్లు ఐసీసీ పూర్తి సభ్య దేశాల నుంచి తీసుకోవల్సి ఉండగా ఒక ప్లేయర్ మాత్రం అసోసియేట్ దేశం నుంచి ఉండవచ్చు. నిరుడు మహిళల ఐపిఎల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినప్పటికీ అంత సీరియస్‌గా తీసుకోలేదని విశ్లేషకులు అంటున్నారు. దేశంలో మహిళా క్రికెటర్ల సంఖ్య పెరగడంతో మహిళల ఐపిఎల్ నిర్వహించాలన్న వాదనకు బలం చేకూరింది.