Wednesday, November 20, 2024

Breaking: తడబాటుకు గురైనా టీమిండియా తగ్గేదేలే​.. విండీస్​ టార్గెట్​ ఎంతంటే?

ఐదో టీ20లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి, 188 పరుగులు చేసింది. వెస్టీండీస్​ టార్గెట్​ 189 పరుగులుగా ఉంది. ఈ మ్యాచ్​లో తొలుత టీమిండియా బ్యాట్స్​మన్​ తడబాటుకు గురయ్యారు. కానీ, కెప్టెన్​ ఇన్సింగ్స్​ ఆడిన హార్దిక్​ పాండ్యా దంచికొట్డంతో టీమిండియా గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. కాగా, ఒక్క శ్రేయస్​ అయ్యర్​ మాత్రమే (64) పరుగులతో కాస్త రాణించాడు. అయితే.. దీపక్ హుడా (38) అవుటైన కాసేపటికే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న శ్రేయాస్ అయ్యర్ (64) కూడా అవుటయ్యాడు. జేసన్ హోల్డర్ వేసిన 13వ ఓవర్ చివరి బంతికి శ్రేయస్ పెవిలియన్ చేరాడు.

ఆఫ్ స్టంప్ ఆవలగా వచ్చిన లోఫుల్‌టాస్‌ను బౌలర్ తల మీదుగా బాదేందుకు శ్రేయాస్ ప్రయత్నించాడు. కానీ దాన్ని సరిగా అంచనా వేయకపోవడంతో పెవీలియన్​ చేరాల్సి వచ్చింది. నేరుగా హోల్డర్ మీదకు బంతి వెళ్లడంతో సులభమైన క్యాచ్ అందుకుని పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత సంజు శాంసన్​ కూడా (15) తక్కువ పరుగులకే అవుటయ్యాడు. కెప్టెన్​ పాండ్యాతో కలిసి దినేశ్​ కార్తీక్​ స్కోరు బోర్డును కదిలించే ప్రయత్నంలోనే కార్తీక్ (12)పరుగుల వద్ద​ అవుటు కావాల్సి వచ్చింది. దీంతో 17.2 ఓవర్ల సమయంలో ఇండియా 158 పరుగుల వద్ద ఉంది.  ఈ తరుణంలో కాస్త స్పీడ్​ పెంచిన హార్దిక్​ పాండ్యా 19.1 ఓవర్లో 28 పరుగులు సాధించి రన్​ అవుటయ్యాడు.

- Advertisement -





Advertisement

తాజా వార్తలు

Advertisement