Thursday, October 17, 2024

Euro Cup | ఇట‌లీపై స్పెయిన్ విజ‌యం…

యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈరోజు గ్రూప్-బిలో ఉన్న‌ స్పెయిన్ – ఇటలీ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. కాగా, ఈ మ్యాచ్‌లో స్పెయిన్ విజయం సాధించింది. రెండో అర్ధభాగంలో స్పెయిన్ ఒక్క గోల్ చేసి ఇటలీపై 1-0తో విజయం సాధించింది.

అయితే ఈ మ్యాచ్ తొలి అర్ధభాగంలో ఇరు జట్లు గోల్స్ చేయకపోవడంతో… విరామ సమయానికి స్కోరు 0-0గా ఉంది. రెండో అర్ధభాగంలో 55వ నిమిషంలో రికార్డో కలాఫియోరీ గోల్ చేయడంతో స్పెయిన్ ఇటలీపై ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ త‌రువాత ఇట‌లీ గోల్ చేయ‌లేక‌పోవ‌డంతో 1-0తో స్పెయిన్ విజయం సాధించింది.

ఇక గ్రూప్-బిలో స్పెయిన్…. వరుసగా రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. అదే గ్రూపులో ఉన్న ఇటలీ ఒక గేమ్ గెలిచి మూడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement