యూరో కప్ 2024లో ఆరు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. స్పెయిన్, జర్మనీ, ఇంగ్లండ్, స్విట్జర్‌లాండ్, పోర్చుగల్, ఫ్రాన్స్ జట్లు ఫైనల్-8కు చేరాయి. మరో రెండు బెర్త్‌లు ఖరారు కావల్సి ఉంది. ఇవాళ (జులై 2) జరిగిన మ్యాచ్‌లో క్రిస్టియానో రొనాల్డో జట్టు పోర్చుగల్.. స్లొవేనియాపై 3-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. పోర్చుగల్ క్వార్టర్ ఫైనల్లో కైలియన్ ఎంబపే జట్టు ఫ్రాన్స్‌తో తలపడనుంది.
ఇక, మిగిలిన రెండు బెర్త్‌ల కోసం నాలుగు జట్లు (రొమేనియా, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, టర్కీ) పోటీ పడుతున్నాయి. రౌండ్ ఆఫ్ 16లో ఉన్న ఈ జట్ల మధ్య నేడు, రేపు మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌ల్లో విజయం సాధించిన జట్లకు చివరి రెండు బెర్త్‌లు దక్కుతాయి. కాగా, నేడు తొలి బెర్త్ కోసం రొమేనియా – నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక ఆఖరి బెర్త్ కోసం ఆస్ట్రియా – టర్కీ రేపు తలపడనున్నాయి.
క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్..
స్పెయిన్ – జర్మనీ (జులై 5)
పోర్చుగల్ – ఫ్రాన్స్ (జులై 6)
ఇంగ్లండ్ – స్విట్జర్లాండ్ (జులై 6)
నాలుగో – ఫైనల్ (జులై 7)