యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో టర్కీ శుభారంభం చేసింది. తమ తొలి మ్యాచ్‌లో జార్జియాతో తలపడిన టర్కీ ఉత్కంఠ పోరులో 3-1తో విజయం సాధించింది. ఫస్ట్ హాఫ్ విరామ సమయానికి స్కోరు రెండు జట్లు 1-1తో ఉండగా.. రెండవ అర్ధభాగంలో మొదటి భాగంలో టర్కీ ఆధిపత్యం చెలాయించింది. జార్జియాను ఒత్తిడిలో పడేసి… వరుసగా రెండు గోల్స్ చేసి గేమ్‌ను గెలుచుకుంది.
దిగ్గజాల సరసన అర్డా గులెర్..
యూరోపియన్ ఛాంపియన్షిప్ చరిత్రలో తన టోర్నీ డెబ్యూ మ్యాచ్ లోనే స్కోర్ చేసిన అతి పిన్న వయస్కుకుడిగా.. టర్కీ అర్డా గులెర్ (19సం) నిలిచాడు. ఇదికరకు 2004లో పోర్చుగల్ తరఫున గ్రీస్‌పై క్రిస్టియానో రొనాల్డో, 1964లో హంగేరీ తరఫున స్పెయిన్ పై ఫెరెన్క్ బెనె చిన్న వయసులో టోర్నమెంట్ అరంగేట్రం మ్యాచ్‌లో గోల్స్ చేశారు. ఇప్పుడు టర్కీ తరఫున జరార్జియాపై అర్డా గులెర్ గోల్ చేసి.. దిగ్గజాల సరసన నిలిచాడు.