Tuesday, September 17, 2024

Euro Cup | ఫైన‌ల్స్‌లో స్పెయిన్‌తో ఇంగ్లండ్‌ ఢీ…

యూరో ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ ఫైన‌ల్స్ లోకి ఇంగ్లండ్ దూసుకెళ్లింది. సెమీస్లో ఇంగ్లండ్ 2-1 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్పై గెలుపొంది ఫైనల్ చేరింది. తొలి అర్ధభాగంలో ఇరు జట్లు చెరో గోల్ చేశాయి. ఆట చివరి నిమిషంలో ఇంగ్లండ్ ప్లేయర్ వాట్కిన్స్ గోల్ చేయడంతో నెదర్లాండ్స్కు ఓటమి తప్పలేదు. 14వ తేదిన‌ జరిగే ఫైనల్లో స్పెయిన్తో ఇంగ్లండ్ తలపడనుంది. జర్మనీలో జరుగుతున్న ఈ టోర్నీలో మూడో స్థానం కోసం పోటీ లేకపోవడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement