Friday, October 4, 2024

Euro Cup | రొమేనియాపై బెల్జియం విజ‌యం..

యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈరోజు జరిగిన మరో మ్యాచ్‌లో గ్రూప– ఇ​లోని బెల్జియం – రొమేనియా జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. కాగా, ఈ మ్యాచ్ లో బెల్జియం విజ‌యం సాధించింది. మోద‌టి నుంచే ఆధిప‌త్యం చెలాయించిన బెల్జియం.. రొమేనియా ఒక్క గోల్ కూడా చేయనివ్వలేదు. దీంతో టర్కియాపై 2-0 తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్ తొలి అర్ధభాగంలో దూకుడుగా ఆడిన బెల్జియం 2వ నిమిషంలో తొలి గోల్ చేసింది. దీంతో విరామ స‌మయానికి రొమేనియాపై 1-0తో అధిక్యం సాధించింది. ఆ తర్వాత అదేద‌కుడు కొనసాగించిన బెల్జియం రొమేనియాకు గోల్ చేసే అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఇక 80వ నిమిషంలో మరో గోల్ చేసిన జెల్జియం 2-0తో విజయం సాధించింది.

గ్రూప్-ఇలో ఉన్న‌ రొమేనియా, బెల్జియం జట్లు ఒక ఓటమి, ఒక విజయంతో మూడు పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇదే గ్రూప్‌లోని స్లోవేకియా, ఉక్రెయిన్‌లు కూడా ఒక విజయం, ఒక ఓటమితో మూడు, నాలుగు స్థానంలో నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement