యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈరోజు జరిగిన మరో మ్యాచ్‌లో గ్రూప– ఇలోని బెల్జియం – రొమేనియా జట్లు తలపడ్డాయి. కాగా, ఈ మ్యాచ్ లో బెల్జియం విజయం సాధించింది. మోదటి నుంచే ఆధిపత్యం చెలాయించిన బెల్జియం.. రొమేనియా ఒక్క గోల్ కూడా చేయనివ్వలేదు. దీంతో టర్కియాపై 2-0 తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ తొలి అర్ధభాగంలో దూకుడుగా ఆడిన బెల్జియం 2వ నిమిషంలో తొలి గోల్ చేసింది. దీంతో విరామ సమయానికి రొమేనియాపై 1-0తో అధిక్యం సాధించింది. ఆ తర్వాత అదేదకుడు కొనసాగించిన బెల్జియం రొమేనియాకు గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. ఇక 80వ నిమిషంలో మరో గోల్ చేసిన జెల్జియం 2-0తో విజయం సాధించింది.
గ్రూప్-ఇలో ఉన్న రొమేనియా, బెల్జియం జట్లు ఒక ఓటమి, ఒక విజయంతో మూడు పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇదే గ్రూప్‌లోని స్లోవేకియా, ఉక్రెయిన్‌లు కూడా ఒక విజయం, ఒక ఓటమితో మూడు, నాలుగు స్థానంలో నిలిచాయి.