Tuesday, November 26, 2024

Sahil chauhan | ఎస్టోనియా బ్యాట‌ర్ విశ్వ‌రూపం.. ప్ర‌పంచ రికార్డులన్నీ బ‌ద్ద‌లు

2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన‌ వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మెన్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 30 బంతుల్లో సెంచరీ సాధించాడు. పూణె వారియర్స్ పై సాధించిన ఈ సెంచరీ రికార్డును బద్దలు కొట్టడం చాలా కాలం నుంచి అసాధ్యంగానే మిగిలిపోయింది. ఈ రికార్డు బద్దలవుతుందని ఎవరూ అనుకోలేదు.. గేల్ ఈ రికార్డు 11 ఏళ్ల పాటు చెక్కుచెదరలేదు కానీ, ఇప్పుడు 2024 ఈ రికార్డు బద్దలైంది. టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఇప్పుడు గేల్ పేరిట లేదు.

27 బంతుల్లో సెంచరీ..

ఎస్టోనియా బ్యాట్స్‌మెన్ సాహిల్ చౌహాన్ ఇప్పుడు సైప్రస్‌పై తుఫాను ఇన్నింగ్స్ ఆడి గేల్ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు. సైప్రస్‌లోని ఎపిస్కోపిలో జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో అతను ఈ ఘనత సాధించాడు. సాహిల్ 41 బంతుల్లో 144 పరుగులతో అజేయంగా నిలిచాడు. కేవలం 27 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నమీబియాకు చెందిన యాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ పేరిట ఉంది. 2023లో నేపాల్‌పై 33 బంతుల్లో సెంచరీ సాధించాడు. సాహిల్ అతని రికార్డును కూడా బద్దలు కొట్టాడు.

ఈ ఎస్టోనియా బ్యాట్స్‌మెన్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. 6 ఫోర్లు, 18 సిక్సర్లతో స్ట్రైక్ రేట్ 351.21తో పరుగుల వరద పారించాడు. అలాగే అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా మరో రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కూడా సాహిల్ రికార్డు సృష్టించాడు. తన ఇన్నింగ్స్ లో 18 సిక్సర్లు కొట్టాడు. గతంలో ఈ రికార్డు ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన హజ్రతుల్లా జజాయ్ పేరిట ఉంది. 2019లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 సిక్సర్లు బాదాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement