టీ20 ప్రపంచకప్‌లో భాగంగా, సూపర్-8కి అర్హత సాధించాలంటే భారీ విజయం సాధించాల్సిన సమయంలో ఒమన్‌పై ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఆంటిగ్వా వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌తో ఆ తర్వాత బ్యాటింగ్‌తో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్ 13.2 ఓవర్లలో 47 పరుగులకు ఆలౌటైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఒమన్‌ను ఆదిలోనే ఆర్చర్, మార్క్ వుడ్ వరుసగా దెబ్బకొట్టారు. క్రమంగా వికెట్లు తీయడంతో పవర్‌ప్లేలో ఒమన్ నాలుగు వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది. ఒమన్ బ్యాటర్లలో షోయబ్ ఖాన్ (11; 23 బంతుల్లో, 1 ఫోర్) మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నాడు. అదిల్ రషీన్ (4/11) నాలుగు వికెట్లతో, మార్క్ వుడ్ (3/12), జోఫ్రా ఆర్చర్ (3/12) చెరో మూడు వికెట్లతో విజృంభించారు.
అనంరం ఛేదనలో ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 3.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ బట్లర్ (24 నాటౌట్) ఒమన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత 3.1 బంతిని బెయిర్ స్టో (8 నాటౌట్) ఫోర్ కొట్టడంతో ఇంగ్లండ్ సూపర్-8 రేసులో ముందంజలో వేసింది.