Friday, October 18, 2024

T20 WC | ఇంగ్లండ్ హ్యాట్రిక్ విన్… స్కాట్లాండ్ పై 10 వికెట్ల విజ‌యం !

మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు (అక్టోబర్ 13) జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు హ్యాట్రిక్ విస్ సాధించింది. గ్రూప్‌-బిలోని స్కాట్లాంగ్ ను చిత్తుగా ఓడించింది 10 వికెట్ల తేడాతో ఘ‌న‌ విజయం సాధించింది.

ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. కేథరీన్ ట్రైస్ (33 పరుగులు) టాప్ స్కోరర్ గా నిలువగా.. సారా బ్రైస్ 27, సస్కియా హోర్లీ 13, ఐల్సా లిస్టర్ 11, మెగాన్ మెక్కాల్ 10 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ రెండు వికెట్లు పడగొట్టగా.. నాట్ సీవర్ బ్రంట్, లారెన్ బెల్, చార్లీ డీన్, డేనియెట్ గిబ్సన్ తలో వికెట్ దక్కించుకున్నారు.

ఇక‌ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 10 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయాన్ని అందుకుంది. మయా బౌచియర్ (62), డేనియెల్ వ్యాట్ హాడ్జ్ (51) అజేయ అర్ధ సెంచరీలతో ఇంగ్లండ్ జ‌ట్టుని గెలిపించారు. ఈ ఓటమితో స్కాట్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక గ్రూప్-బి పాయింట్స్ టేబుల్ లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ వరుస స్థానాల్లో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement